calender_icon.png 25 August, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద కుటుంబానికి మాజీ మున్సిపల్ చైర్మన్ సహాయం అందజేత

25-08-2025 02:53:35 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మున్సిపల్ 11వ వార్డులో ఒక నిరుపేద కుటుంబానికి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల రాజీవ్ నగర్ కాలనీలో కుటుంబ పెద్ద కిషోర్ సింగ్ మరణించగా ఆ తల్లి నలుగురు పిల్లలను పోషించుకుంటూ కష్టపడుతున్న నేపథ్యంలో గమనించిన మాజీ చైర్మన్ వారికి నిత్యావసర సరుకులు, నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కె ఎన్ ఆర్ కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్, సిబ్బంది కమల్ రాజ్, పోశెట్టి, కాలనీవాసులు పాల్గొన్నారు.