25-08-2025 02:06:56 AM
-గోపీచంద్ అకాడమీలో ముగిసిన అంతర్జాతీయ టోర్నీ
-కోటక్ జూనియర్ సిరీస్‌లో భారత హవా
-మహిళల సింగిల్స్‌లో టైటిల్ నెగ్గిన శ్రియాన్షి వలిశెట్టి
-పురుషుల సింగిల్స్‌లో హోరాహోరీ పోరులో గెలిచిన రౌనక్ చౌహాన్
హైదరాబాద్ సిటీ బ్యూరో ఆగస్టు 24 (విజయక్రాంతి): హైదరాబాద్ వేదికగా జరిగిన కోటక్ ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో భారత యువ షట్లర్లు సత్తా చాటా రు. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీ లో ఐదు టైటిళ్లనూ భారత క్రీడాకారులే కైవసం చేసుకుని సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. మహిళల సింగిల్స్‌లో శ్రియా న్షి వలి శెట్టి సునాయాసంగా టైటిల్ కైవసం చేసుకోగా, పురుషుల సింగిల్స్‌లో రౌనక్ చౌహాన్ హోరాహోరీ పోరులో గెలిచాడు.
మహిళల అండర్- సింగిల్స్ ఫైనల్‌లో మూడో సీడ్ శ్రియాన్షి వలిశెట్టి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆమె ప్రత్యర్థి ఐక్య శెట్టిపై ఏ దశలో నూ అవకాశం ఇవ్వకుండా 21 21 సునాయాసంగా గెలిచి టైటిల్‌ను ముద్దాడింది. ఇక ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో టాప్ సీడ్ రౌనక్ చౌహాన్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. తొలి గేమ్‌ను 15 కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని తలసిలా టంకారా జ్ఞానదత్తుపై 15-- 21 21-- తేడాతో విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకున్నాడు.
డబుల్స్‌నూ జోరు
డబుల్స్ విభాగాల్లోనూ భారత క్రీడాకారుల జోరు కొనసాగింది. హోరా హోరీగా మూడు గేమ్‌ల పాటు సాగిన పురుషుల డబుల్స్ ఫైనల్‌లో నిరంజన్ నందకుమార్, యుధాజిత్ రెడ్డి పడిగేపాటి జంట 17-- 21-- 23-- తేడాతో భవ్య చాబ్రా, లాల్రంసంగ ద్వయంపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో దీపక్ రాజ్ ఆదితి పన్నమ్మ బి.వి. వృద్ధి జోడీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో వంశ్ దేవ్, శ్రావణి వాలేకర్ జోడీ విజేతలుగా నిలిచారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాధ్యక్షులు పి. చాముండేశ్వరీనాథ్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బ్యాట్ జాయింట్ సెక్రెటరీ యు.వి.ఎన్. బాబు, కోశాధికారి కానూరి వంశీధర్, బీఏవీడీ జిల్లా అధ్యక్షుడు కొసరాజు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.