ఓఆర్‌ఆర్‌పై టిప్పర్‌ను ఢీకొట్టిన కారు
కూతురు మృతి - తండ్రి, కొడుకుకు తీవ్ర గాయాలు
పటాన్ చెరు, జూన్ 9 : ఓఆర్‌ఆర్ పై సోమవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పటాన్ చెరు పరిధిలోని పాటి సమీపంలో జరిగింది. బీడీఎల్ సీఐ స్వామిగౌడ్ తెలిపిన వివరాల మేరకు...
రంగారెడ్డి జిల్లా గండిపేట్ కు చెందిన దేవత భిక్షపతి తన ఇద్దరు పిల్లలు శ్రీవైష్ణవి(12), సాకేత్ తో కలిసి కరీంనగర్ వెళ్లి తిరిగి సోమవారం తెల్లవారు జామున గండిపేట్కు తన కారులో వస్తుండగా పాటి సమీపంలోని ఓఆర్‌ఆ్ప ఇండికేటర్ లు వేయకుండా నిర్లక్ష్యంగా నిలిపి ఉంచడంతో టిప్పర్ ను డీకొట్టారు.
ఈ ప్రమాదంలో శ్రీవైష్ణవి మృతి చెందగా సాకెత్, భిక్షపతికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. భిక్షపతి సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాగా సాకెత్ పదో తరగతి, శ్రీవైష్ణవి ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.






