ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్యాబోధన
‘బడిబాట’లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
వరంగల్ జూన్ 9 (విజయ క్రాంతి): ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని, ప్రభుత్వం పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఎంతో ఉన్నతమైన విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారని చెప్పారు. విద్యా బోధన, ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లల సర్వే నిర్వహించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు వివరించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం, రాగి జావా, యూనిఫారమ్స్ అందించటం జరుగుతుం దన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారనే మంచి నాణ్యమైన విద్యా అందుతుందన్నారు. ప్రతీ ఒక్కరు తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.






