calender_icon.png 20 August, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్ ఆర్సీలతో కార్ల విక్రయాల ముఠా గుట్టు రట్టు

20-08-2025 07:31:33 PM

ఆరుగురు అరెస్టు రిమాండ్ 

కార్లను అద్దెకు తీసుకొని అమ్మకాలు చేపట్టిన ముఠా  

ఆన్లైన్లో కార్ల విక్రయాలు

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి (విజయక్రాంతి): ఫేక్ ఆర్సీలతో ఆన్లైన్లో కార్లను అమ్ముతున్న ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆన్లైన్లో కార్లు  విక్రయిస్తున్న ముఠా వివరాలను వెల్లడించారు. హైదరాబాదుకు చెందిన ఏడుగురు, ముఠాగా ఏర్పడి ఫేక్ ఐడిలు ఫేక్ ఆర్సి లతో కారులను అమ్మి తిరిగి వాటిని చోరీ చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఫేస్బుక్ అప్లికేషన్ ద్వారా కారు కొనుక్కున్న వ్యక్తుల కారును రెండు రోజుల తర్వాత కారు నాది అని మీరెలా కొనుక్కుంటారని బెదిరిస్తూ కారును తీసుకెళ్తున్న కేసు మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో జూలై 1న నమోదు కాగా కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.

కారు సెల్ఫ్ డ్రైవింగ్ కోసమని అద్దెకు తీసుకొని ఏడుగురు ముఠా గా ఏర్పడి, కార్లకు ఫేక్ నంబర్ ప్లేట్, ఫేక్ ఐడి లు తయారు చేస్తారని తెలిపారు. ఈ గ్యాంగ్ కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకొని గత పది రోజులుగా శేర్లింగం పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తల దాచుకున్న  ఆరుగురిని అరెస్టు చేయగా ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి కి చెందిన అయాజ్, తో పాటు వికారాబాదు అల్లంపూర్కు చెందిన మహమ్మద్ జహీదు  అలీ, రామచంద్రపురం చెందిన పృథ్వి జగదీష్, వరంగల్ కు చెందిన రాచర్ల శివకృష్ణ, సాకేత్, వివేక్ లపై కామారెడ్డి జిల్లాలో ఒక కేసు,  వీరిపై ఇతర జిల్లాల్లో పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. వారి నుంచి ఎన్నో కారు, ఎర్టిగా, బాలెనో కారు, జిపిఎస్ ల్యాప్టాప్, 15 మొబైల్ ఫోన్లు, పది మైక్రోసాఫ్ట్ సిమ్ కార్డులు, ఏంటి చిప్ కార్డు, ఫోర్జరీ చేసిన ఆర్సీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.