calender_icon.png 25 November, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయోలాజిక్స్ విస్తరణను వేగవంతం చేస్తాం

25-11-2025 12:00:00 AM

  1. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
  2. జీనోమ్ వ్యాలీ 25 ఏండ్ల లోగో ఆవిష్కరణ

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): బయోలాజిక్స్ విస్తరణ అవకాశాలను ఆవిష్కరణ నుంచి క్లినికల్ దిశగా వేగవంతం చేయడమే దేశంలో అత్యంత ముఖ్యమైన చర్యల్లో ఒకటి అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. జీనోమ్ వ్యాలీ ప్రారంభించి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కొత్త జీనోమ్ వ్యాలీ లోగోను సోమవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీనోమ్ వ్యాలీ 25 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దాని తదుపరి 25 ఏళ్ల మార్గాన్ని నిర్దేశిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సౌకర్యంతో దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి చేసిన ఆవిష్కరణలు హైదరాబాద్‌లో పైలట్, క్లినికల్ దశలకు వేగంగా, తక్కువ ఖర్చుతో పురో గమిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. జీనోమ్ వ్యాలీకి కొత్త గుర్తింపు, గేట్‌వే నిర్మాణం, రూ.200 కోట్లకుపైగా ప్రణాళికాబద్ధమైన మౌలి క సదుపాయాల ఆధునీకరణలతోపాటు లైఫ్ సెన్సైస్‌లో ప్రపంచస్థాయి వృద్ధి దిశగా ఈ క్లస్టర్‌ను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

ఐటీ, పరి శ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. దేశ లైఫ్ సెన్సైస్ రంగం వృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందని తెలిపారు. దేశపు ఫార్మా ఉత్పత్తిలో 40 శా తం, ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మూడో వంతు వాటాను రాష్ట్రం కలిగి ఉందని వివరించారు.