calender_icon.png 28 October, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు నగలు ధరించి బయటకి ఒంటరిగా వెళ్లొద్దు

28-10-2025 05:22:15 PM

కట్టంగూర్ ఎస్సై రవీందర్..

నకిరేకల్ (విజయక్రాంతి): మహిళలు నగలు ధరించి ఒంటరిగా బయటకి వెళ్లొద్దు.. ఒకవేలా వెళితే అప్రమత్తంగా ఉండాలని కట్టంగూర్ ఎస్సై యం.రవీందర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బంగారు నగలు దొంగతనాలు ఎక్కువగా జరుగుచున్నాయి ఎడల జాగ్రత్తగా రక్షణ ఉన్న చోట నగలను భద్రపరుచుకోవాలని ఆయన కోరారు. ఇంటి బయట రాత్రివేళ నిద్రించవద్దు ఇంట్లోనే తలుపులకి గడియ పెట్టుకొని నింద్రించాలని ఆయన సూచించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు, అనుమానస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని లేదా 100 కి పోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలు కోరారు.