28-10-2025 07:52:59 PM
కలెక్టర్ బి.యం. సంతోష్
గద్వాల,(విజయక్రాంతి): ముందా తుపాను ప్రభావం వల్ల రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు.
తుపాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ, అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న మూడు రోజుల పాటు అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. వరి ధాన్యం, పత్తి మొక్కజొన్నలు కొనుగోళ్ల నేపథ్యం ధాన్యం తడిసి రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.