10-05-2025 05:16:15 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): భారత్-పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో భారతీయ జవాన్లకు సంఘీభావం తెలుపుతూ మేము సైతం యుద్ధంలో పాల్గొంటాం అంటూ నినాదాలు చేస్తూ తుంగతుర్తి మండల ప్రజలు శనివారం రోజున మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మృతి చెందిన సైనిక కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాదం ఉపేక్షించేది లేదని భారతీయ జవాన్లకు అండదండగా ఉంటామని అవసరమైతే మేము మా ప్రాణాలు సైతం, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వన ఉగ్రవాదులను ఏరి పారేసే దిశలో తమ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు తాటికొండ సీతయ్య, గుండ గాని రాములు గౌడ్, పెద్ద బోయిన అజయ్ కుమార్, గాజుల మహేందర్ పులి పంపుల సైదులు గౌడ్ ఎనగందుల సంజీవ పోలవరపు సంతోష్ తల్లాడ నారాయణ, విజ్జు నాయక్, యువత పాల్గొన్నారు.