calender_icon.png 15 May, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాన్‌షాప్‌లో గంజాయి యువకుడిపై కేసు నమోదు

15-05-2025 12:00:00 AM

ఆదిలాబాద్, మే 14 (విజయక్రాంతి): అదిలాబాద్ పట్టణం తిర్పెల్లిలోని పాన్ షాప్‌లో గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకుంటూ అమ్ముతున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. తిర్పెల్లికి చెందిన షేక్ నౌషద్ గత కొన్ని నెలల నుంచి మహారాష్ట్ర లోని కిన్వాట్‌కు చెందిన ఖుర్బాన్ నుంచి ఎండిన గంజాయిను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని చిన్న ప్యాకెట్లుగా చేసు కుంటూ ప్రజలకు ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు.

ఖానాపూర్ చెరువు కట్ట వద్ద గంజా యి తాగుతూన్న షేక్ నౌషద్ అదుపులోకి తీసుకుని విచారించగా దందా బైట పడింది. ఆయనకు గంజాయి నిర్ధారణ పరీక్ష చేయగా అందులో పాజిటివ్ వచ్చిందన్నారు. అతనిపై కేసు చేసినట్లు సీఐ తెలిపారు.