15-05-2025 12:00:00 AM
ఏరియా పీఎం శ్యాం సుందర్
మందమర్రి, మే 14 : కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఏరియాలో సింగరేణి యాజమా న్యం ఆధ్వర్యంలో యువతీ, యువకులకు తేనె టీగల పెంపకం పై ఉచిత శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించేలా ప్రోత్సహిస్తుందని సింగరేణి ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాం సుందర్ తెలిపారు.
జీఎం కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల పిల్లలు, సింగరేణి ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాం తాలు, భూ నిర్వాసితులకు, నిరుద్యోగ యువతకు, పరిసర గ్రామాల యువతి యు వకులకు, సింగరేణి సేవ సమితి సభ్యులకు, స్వయం ఉపాధి కల్పించేందుకు తేనెటీగల పెంపకంలో శిక్షణను అందించి ప్రోత్సహిస్తుందని, ఆసక్తి గల అభ్యర్థులు తమ దర ఖాస్తులను జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్టుమెంట్ లోని సింగరేణి సేవాస మితి/కమ్యూనికేషన్ సెల్ నందు అందజేయాలని కోరారు.