14-05-2025 11:26:59 PM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాల్లో తెలుసుకున్న విషయాలతో విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధి పెంపొందించడంతో పాటు, చదువులో ముందంజలో ఉండే విధంగా చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) కోరారు. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న గుణాత్మక విద్య నైపుణ్యత శిక్షణా తరగతులు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గుణాత్మక విద్య శిక్షణ ద్వారా విద్యార్థులకు తరగతి గదుల్లో అభ్యాసన భయం పోగొట్టి, ప్రతిభ చాటుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు.
పలువురు ఉపాధ్యాయులను పాఠశాలలో జరుగుతున్న బోధన అంశాలపై సవివరంగా ప్రశ్నించారు. ఉపాధ్యాయులు ఏ విధంగా పనిచేస్తే మరింత మెరుగైన విద్య అందించవచ్చన్న విషయాలపై అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులపై ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ వహించాలన్నారు. కొత్తగూడ మండలంలోని ఓ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు స్కూల్ కు సరిగా హాజరు కాకపోవడంతో గణితం, ఆంగ్ల బాషా నైపుణ్యత సాధించలేకపోతున్నారని తెలిపారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ... ఆంగ్ల భాష, గణితం సబ్జక్ట్స్ పై విద్యార్థులకు మక్కువ పెంచేలా చర్యలు తీసుకోవాలని, తరగతి గదుల్లో లెర్నింగ్ లెవెల్ పెంపొందించాలని, ప్రత్యేక తరగతులు తీసుకోవాలని సూచించారు.
తెలుగు లాంటి లాంగ్వేజ్ పరీక్షల్లో విద్యార్థులు వెనుక పడకుండా చూసుకోవాలన్నారు. పదవ తరగతి విద్యార్థులు సాధించిన అత్యుత్తమ ఫలితాలకు అనుసరించిన పద్ధతులు 7,8,9 తరగతులలో అనుసరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడి సత్యనారాయణ, జిల్లా విద్యాధికారి ఏ.రవీందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఏసీజీ మందుల శ్రీరాములు, ప్రోగ్రాం అధికారులు చంద్రశేఖర్ ఆజాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.