calender_icon.png 11 November, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీమార్గం ద్వారానే కేసుల పరిష్కారం

11-11-2025 08:05:47 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): రాజీమార్గం ద్వారానే కేసులను పరిష్కరించుకోవాలని బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్ కోరారు. ఈనెల 15న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్ తో తక్కువ ఖర్చుతో నిరూపక్షాల అంగీకారంతో కేసులు సామరస్యపూర్వకంగా పరిష్కరించబడతాయని తెలిపారు. వివరాలకు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.