26 June, 2026 | 5:51 PM

23 స్కూల్ బస్సులపై కేసులు నమోదు

14-06-2024 01:21 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): నగరంలోని స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల డ్రైవ్ నడుస్తున్న నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు గురువారం 23 కేసులు నమోదు చేశారు. ఖైరతాబాద్, తిరుమలగిరి, మలక్‌పేట, బహదూర్‌పురా, టోలి చౌకి ప్రాంతాల్లోని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో అధికారులు స్కూల్ బస్సుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 23 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ జేటీసీ రమేశ్ తెలిపారు. 

15 బస్సులు సీజ్..

పటాన్‌చెరు/జహీరాబాద్, జూన్ 13: పటాన్‌చెరు ఆర్టీవో విజయరావు, అధికారులు గురువారం పటాన్‌చెరులోని ప్రధాన రహదారిపై పాఠశాలలు, కళాశాలల బస్సుల తనిఖీ చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్, బస్సు ఫిట్‌నెస్, పర్మిట్, ట్యాక్స్, కండిషన్ సరిగా లేకుండా రోడ్లపై నడుస్తున్న 13 బస్సులను సీజ్ చేశారు. జహీరాబాద్ మోటార్ వెహికిల్  ఇన్‌స్పెక్టర్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి రెండు ప్రైవేటు పాఠశాలల బస్సులను సీజ్ చేశారు.