బస్టాండ్‌లో షెటర్ల లీజుకు టెండర్ల ఆహ్వానం
యాచారం, జూన్ 13 : యాచారం మండల కేంద్రంలోని బస్టాండ్‌లో ఆర్టీసీకి సంబంధించిన షటర్లు, ఖాళీ స్థలాల్లో తాత్కాలిక షెడ్లు, పార్కింగ్ ఏర్పాటుకు ఐదేళ్ల పాటు అద్దె ప్రతిపాదికన లీజు కొరకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆసక్తిగల వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వెంకట నర్సప్ప ఓ ప్రకటనలో తెలిపారు. యాచారం పరిసర ప్రాంత వాసులు బస్టాం డ్ ఆవరణలో టీ స్టాల్, పార్కింగ్, ఫుట్‌వేర్, కూల్ డ్రింక్స్, స్నాక్స్, దుకాణ సముదాయాల నిర్వహణ కొరకు టెండర్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఎంజీబీఎస్‌లోని డీఓ/హెచ్‌ఆర్ కార్యాలయాన్ని సంప్రదించి ఈ నెల 18 ఉదయం 12 గంటలలోపు దరఖాస్తులను టెండర్ బాక్సులో వేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 833093 5733, 97030 37357 అనే నంబర్లను సంప్రదించాల్సిందిగా అధికారులు కోరారు.






