రూ. 46.63 లక్షలు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : ఎన్నికల ప్రవర్తన నియమా వళిలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఒక్క రోజులో రూ. 46.63లక్షల నగదును, ఒక కోటి 21లక్షల విలువైన ఇతర వస్తువులు, 152.49లీటర్ల మద్యంను పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. ఈ సందర్భంగా నగదు, ఇతర వస్తువులపై 17 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కారం చేశామన్నారు.
8 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, లైసెన్స్ కలిగి ఉన్న 41ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం రూ. 19,67,06,705 కోట్ల నగదు, రూ. 9,43,95,567 కోట్ల విలువ గల వస్తువులు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సీజ్ చేశారని, అలాగే 21,618,95 లీటర్ల మద్యంను స్వాధీ నం చేసుకొని, 255 కేసులు నమోదు చేయ గా, 251 మందిని అరెస్ట్ చేసినట్లు డీఈవో తెలిపారు. ఇప్పటివరకు నగదు, ఇతర వస్తువులపై 537 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామన్నారు. 346 మంది పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. 3065 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు రోనాల్డ్‌రోస్ పేర్కొన్నారు.




