11 April, 2026 | 6:34 AM

నిరాశ చెందొద్దు..

01-05-2024 01:16 AM

పదో తరగతి విద్యార్థులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి)ః పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు పంచాయితీరాజ్, గ్రా మీణా భివృద్ధి, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపా రు. ఫలితాల్లో ఫెయిల్ అయిన వారు నిరాశ చెంందకుండా మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలని సూచించారు. చదివే చదువు సమాజానికి, సమాజ అభివృద్ధికి ఉపయో గపడేలా ఉండాలని చెప్పారు. ఉన్నతమైన చదువులు చదివి  బంగారు భవిష్యత్తుకు బాట లు వేసుకోవాలన్నారు. దేశ భవిష్యత్తు నేటి విద్యార్థినీ విద్యార్థుల మీదే ఆధారపడి ఉందని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి  ఉన్నత శిఖరాలకు  చేరుకోవాలని ఆకాంక్షించారు.