calender_icon.png 1 August, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ సేఫ్టీలో 416 క్యాచ్‌పిట్‌ల పూడ్చివేత

01-08-2025 01:26:43 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లపై భద్రత పెంపొందించడంలో భాగంగా రోడ్ సేఫ్టీ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో పాట్ హోల్స్, క్యాచ్ పిట్స్, సెంట్రల్ మీడియన్ మరమ్మతు పనులు చేపడుతున్నారు.

జోన్ల వారీగా పనుల వివరాలు:

ఎల్‌బీనగర్ జోన్‌లో మొత్తం 2,533 క్యాచ్ పిట్స్ గుర్తించగా వాటిలో గురువారం వరకు 1,918 పూర్తయ్యాయి. చార్మినార్ జోన్‌లో 1,873 క్యాచ్ పిట్స్ గుర్తించగా వాటిలో  1,463లను పూర్తిచేశారు. ఖైరతాబాద్ జోన్‌లో 1,241 క్యాచ్ పిట్స్ గుర్తించగా వాటిలో మొత్తం 823 పూర్తయ్యాయి. శేరిలింగంపల్లి జోన్‌లో 1,546 క్యాచ్ పిట్స్ గుర్తించగా మొత్తం 538 పూర్తయ్యాయి. కూకట్‌పల్లి జోన్‌లో మొత్తం 1,381 గుర్తించగా, ఇప్పటి వరకు మొత్తం 1,037 పరిష్కరించారు. సికింద్రాబాద్ జోన్‌లో 1,808 క్యాచ్‌పిట్‌లను గుర్తించగా, మొత్తం 1,017 పరిష్కరించారు. మొత్తంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 10,382 క్యాచ్‌పిట్స్ గుర్తించి 6,796 పరిష్కరించింది. వివిధ జోన్లలో గురువారం ఒక్కరోజే 416 క్యాచ్‌పిట్‌లను పరిష్కరించారు.