calender_icon.png 1 August, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమల కట్టడిపై జీహెచ్‌ఎంసీ దృష్టి

01-08-2025 01:24:05 AM

- నగరంలో ముమ్మరంగా యాంటీ లార్వా ఆపరేషన్లు

- దోమల నిర్మూలన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కమిషనర్

- సత్ఫలితాలిస్తున్న బల్దియా చర్యలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జులై 31 (విజయక్రాంతి): బల్దియా కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశాల మేరకు నగర ప్రజలను దోమల బాధ నుంచి రక్షించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ముమ్మరంగా యాంటీ లార్వా ఆపరేషన్లపై ఫోకస్ పెట్టింది. జూలై నెలలో 15,500కు పైగా కాలనీల్లో దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టింది.

అంతేకాకుండా దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు సంబంధిత కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తుంది. యాంటి లార్వా ఆపరేషన్లలో వేలాది మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 34,45,357 ఇండ్లను రెండు, మూడు సార్లు రిపీట్‌గా తనిఖీ చేయగా లార్వాతో ప్రభావమైన ఇండ్లు 1.5 శాతం ఉన్నట్టు నిర్ధారిం చారు.

అలాగే కోటి 10 లక్షల 35 వేల కంటైనర్లను తనిఖీ చేయగా 0.5 శాతం కంటైనర్లు ప్రభావితమైనట్టు నిర్ధారణ అయ్యింది. ఈ నెలలో 1700కు పైగా స్కూళ్లలో , 320కు పైగా కళాశాలలో ఐఆర్‌ఎస్ స్ప్రే, పిల్లలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ముఖ్యంగా డెం గ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న కార్యక్రమాలను కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు.

లోటుపాట్లను సమీక్షిస్తూ యాంటీ లార్వా ఆపరేషన్లను ప్రభావంతం గా చేపట్టేందుకు అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. బల్దియా క్రమం తప్పకుండా చేపడుతున్న చర్యలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయి.