calender_icon.png 25 January, 2026 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందూరులో సందడి చేసిన ప్రముఖ సినీ తార రితిక నాయక్

24-01-2026 12:00:00 AM

  1.  గంగారాం జువెలరీని ప్రారంభించిన ఎమ్మెల్యే 
  2.  సినీ తారలతో సందడిగా మారిన ఇందూరు 

నిజామాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలో శుక్రవారం  ప్రజలకు మరో కొత్త జువెల్లరీ షాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ సినీనటి రితిక నాయక్ చేతుల మీదుగా జ్యువెలరీ షాప్ ప్రారంభించారు. నగల కొనుగోలుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళా కొనుగోలు దారులతో సినీనటి రితిక నాయక్ సందడి చేశారు. ఆమెతోపాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గంగారాం జ్యువెలరీ ఇందూరు నగరంలో మహిళలకు మరిన్ని  డిజైన్ల నగలను ఈ జువెలరీ షాప్ యజమానులు అందుబాటులోకి  తెచ్చారని కస్టమర్ల నమ్మకాన్ని జువలరి యజమాన్యం ప్రదర్శనకు పెట్టారు, వారికి నాణ్యమైన డిజైన్ల నగలను అందుబాటులో ఉంచాలని జువెలరీ యజమాన్యాన్ని ఆయన కోరారు. ఇందూరు నగరంలో మరో గొప్ప జ్యువలరీ దుకాణం అందుబాటులోకి రావడం అభినందనీయమని తెలిపారు. సినీనటి అందాల తార రితిక నయక్ సందడి చేయడం అభినందనీయమన్నారు.  ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతు కిరణ్, నగర ప్రముఖులు హాజరయ్యారు.