14-10-2025 09:59:17 PM
వైద్యాధికారి డాక్టర్ నరేష్
గరిడేపల్లి (విజయక్రాంతి): ప్రతి వంద మరణాల్లో దాదాపు పది మరణాలు గుండెపోటుతోనే సంభవిస్తున్నాయని, గుండెపోటు వచ్చిన వెంటనే సిపిఆర్ చేయడం ద్వారా బాధితుడు ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుందని దీనివల్ల ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని గరిడేపల్లి పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ వి.నరేశ్ అన్నారు. సోమవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని గరిడేపల్లి జెడ్‌పిహెచ్‌ఎస్, కేజీబీవీ పాఠశాలల్లో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సిపి ఆర్‌పై అవగాహన కలిగి ఉండటం అత్యవసరమని ఎదటి వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ చేయడం ద్వారా బాధితులు ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. అలాగే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని, ప్రతిరోజూ నడక, వ్యాయామం, యోగ, ధ్యానం చేయాలని, ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలని సూచించారు. ఆహారపు అలవాట్లలో జంక్ ఫుడ్‌ను నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎన్. అంజయ్య, అశోక్, ఉపాధ్యాయులు సాయిలు, ఏఎన్ఎం అంజలి, ఆశా కార్యకర్తలు ఉమా, ఉపేంద్ర, సైదమ్మతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.