13-12-2024 01:24:07 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో వేలాది మందిని మోసం చేసి సుమారు రూ. 842.15 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ‘సాహితీ ఇన్ ఫ్రా డెవలపర్స్’ సంస్థపై గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం పోలీసులు సాహితీ ఇన్‌ఫ్రాకు సంబంధించిన సుమారు రూ.200 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. కేసుకు సంబంధించి గతంలో సంస్థ ప్రతినిధి లక్ష్మినారాయణతో పాటు 22 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.