13-12-2024 01:25:05 AM
ప్రణీత్ గ్రూప్ స్థాపకుడు నరేంద్ర కుమార్ కామారాజు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయమైన పేరు గాంచిన ప్రణీత్ గ్రూప్ తన ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ‘ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్’ నిర్మాణ పురోగతిని ప్రకటించింది. ఈ సందర్భంగా గురువారం ప్రణీత్ గ్రూప్ స్థాపకుడు నరేంద్ర కుమార్ కామారాజు మాట్లాడుతూ.. ‘ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్’ కేవలం గృహాలు మాత్రమే కాదు, ఒక విలాసవంతమైన జీవనశైలిని అందించేందుకు మా కట్టుబాటుకు నిదర్శనమని అన్నారు.
గగిళ్లపూర్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో 50% కంటే ఎక్కువ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, కంపెనీ ప్రాజెక్ట్‌ను వారి వినియోగదారులకు నిర్దేశించిన సమయానికి అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రత్యేక లగ్జరీ విల్లా కమ్యూనిటీ 70 ఎకరాల్లో విస్తరించి.. 167 చ.గజాల నుంచి 350 చ.గజాల వరకు విభిన్న పరిమాణాల్లో విల్లాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దీనిలో 2,200 చదరపు అడుగుల నుంచి 4,500 చదరపు అడుగుల వరకు ప్రదేశం ఉంటుంది.
ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ స్పానిష్ ఆర్కిటెక్చర్ అందాన్ని, ఎలిగేన్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చే అద్భుతమైన విల్లా కమ్యూనిటీగా నిలుస్తుంది. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ విలాసం, సౌలభ్యం, ఆనందాన్ని కలపడానికి గొప్ప ఎంపికగా నిలుస్తుంది.
ధర 1.70 కోట్ల నుంచి ప్రారంభంలో ఉందని అందమైన ఇంటీరియర్స్ స్పానిష్ ఆర్కిటెక్చర్ కలిగిన టెర్రాకోట రూఫ్స్, ఆర్చ్ డోర్వేస్, ప్రాణమిచ్చే రంగుల ఫసాడ్‌లు, స్విమ్మింగ్ పూల్, ఫుల్‌ఫ్లెడ్జ్ జిమ్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ కోర్ట్స్, క్లబ్ హౌస్, హోమ్ థియేటర్, సూపర్‌మార్కెట్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, లేక్‌సైడ్ యాక్టివిటీస్, బోటింగ్ సౌకర్యం, సరస్సు ఒడ్డున పిక్నిక్ వంటి అనేక ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుందని తెలిపారు. వినియోగదారుల విశ్వాసానికి తగిన విధంగా ప్రాజెక్ట్‌ను సమయానికి పూర్తిచేయడంలో మేము గర్విస్తున్నామని అన్నారు.
2007లో స్థాపించబడిన ప్రణీత్ గ్రూప్, గడిచిన 17 ఏళ్లలో 15 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని పూర్తిచేసి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో విశ్వసనీయమైన పేరుగా నిలిచింది. మరిన్ని వివరాల కోసం ప్రణీత్ గ్రూప్ వెబ్‌సైట్, ప్రణీత్ గ్రోవ్‌పార్కు వెబ్‌సైట్‌లలో సందర్శించాలని గ్రూప్ స్థాపకుడు నరేంద్ర కుమార్ కామారాజు తెలిపారు.