13-12-2024 01:20:35 AM
దంపతుల దుర్మరణం
నారాయణఖేడ్ , డిసెంబర్ 12 : రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ పరిధిలోని మల్లూరుతండాకు చెంది న సంఘేనాయక్(50), సంగీతబాయ్ (45) దంపతులు.
గురువారం వారు మల్లూరుతండా నుంచి ఎక్సైల్ మోపెడ్ పైన నారాయణఖేడ్‌లో కూరగాయలు అమ్ము కొనేందుకు వస్తుండగా మార్గమధ్యలో కల్హేర్ మండలంలోని కిష్టా పూర్ వద్ద ఎదురుగా వస్తున్న జీపు ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.