calender_icon.png 29 September, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి

29-09-2025 01:03:41 AM

గ్రూప్-1 నిరుద్యోగ జేఏసీ డిమాండ్

ఖైరతాబాద్, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి): గ్రూప్-1 పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని ఉద్యోగాలకు ఎంపికకాని పలువురు గ్రూప్-1 అభ్యర్థులు ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్-1 నియామకాల ప్రక్రియ చట్టవి రుద్ధమని అన్నారు.

ఈ మేరకు ఆదివారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి పలువురు గ్రూప్-1 అభ్యర్థులు గంగ భాస్కర్, రమ్య, ఝాన్సీరాణి, లక్ష్మి, జైలిసింగ్ బాలాజీ నాయక్, వెంకటేశ్ కరుణాకర్, మోహన్, రమావత్ మోహన్ తదితరులు మాట్లాడారు. గ్రూప్-1 పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు.

గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చినప్పటి  నుంచి పరీక్ష పూర్త య్యే ంత వరకు అవకతవకలే చోటు చేసుకున్నాయని ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షకు 21,0 78 మంది దరఖాస్తు చేసుకొంటే, 21,0 88 మంది అభ్యర్థులు పరీక్ష ఎలా రాస్తారని ప్రశ్నించారు.  యూపీఎస్సీ తరహాలో బ్లూ ప్రింట్ తీయకుండా మూల్యాంకనం చేయడంతో అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు.