calender_icon.png 29 September, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ వ్యవస్థాపక సూత్రాలను బీజేపీ దెబ్బతీసింది

29-09-2025 01:19:45 AM

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్

ముషీరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): బిజెపి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట మతానికి మద్దతు ఇవ్వడం ద్వారా, మతతత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశ వ్యవస్థాపక సూత్రాలనే దెబ్బతీస్తోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం, జాగో నవ తెలంగాణ ఆధ్వర్యంలో చైర్మన్ జస్టిస్ బి. చంద్ర కుమార్ అధ్యక్షతన ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి- ఎన్నికల కమిషన్ న్యాయవ్యవస్థ స్వతంత్రను కాపాడాలి‘ అనే అంశంపై సమావేశం నిర్వహిం చారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సుప్రింకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాం త్ భూషణ్, సిపిఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేనీ సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఓట్ నీడ్ గ్యారెంటీ ఆర్గనైజేషన్ నాయకురాలు సోగరా బేగం, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ దిడ్డి సుధాకర్, తెలంగాణ సాయుధ పోరాట యోధులు కంది మల్ల ప్రతాప్‌రెడ్డి, పలు పార్టీల, ప్రజాసంఘాల నాయకులు, వక్తలు హాజరై ప్రజా హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై మాట్లాడుతూ.. వారి ఆలోచనలను వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాం త్ భూషణ్ మాట్లాడుతూ దేశాన్ని శాస్త్రీయ దృక్పథం లేకుండా పూర్తిగా అందవిశ్వాసాలతో తయారు చేస్తున్నారన్నారు. బ్యాంకింగ్ సిస్టంలో కూడా మార్పులతో పాటుగా పారదర్శకత పెరగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడి, ఐటీ, సిబిఐ, స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలను దేశంలో ప్రతిపక్షాలను అణచివేయడానికి తమ జేబు సంస్థలుగా వాడుకుంటుందన్నారు. ప్రజాస్వామ్యంపై పెరుగు తున్న ముప్పులు, న్యాయవ్యవస్థ, స్వాతం త్రం, ఎన్నికల కమిషన్ పాత్ర, ప్రజా హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలందరూ గొంతెత్తి సత్యాన్ని ప్రచారం చేయాలన్నారు.