calender_icon.png 9 August, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ హైస్కూల్‌లో ఘనంగా ముగిసిన సీబీఎస్‌ఈ 7 క్లస్టర్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్

09-08-2025 12:00:00 AM

కొత్తపల్లి, ఆగస్టు 8  (విజయక్రాంతి): కొ త్తపల్లిలోని అల్ఫోర్స్ హై స్కూల్ - సీబీఎస్‌ఈ లో గత మూడు రోజులుగా కొనసాగుతున్నటువంటి సీబీఎస్‌ఇ క్లస్టర్ 7 టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదని మరియు ప్రొఫెషనల్ క్రీడగా ప రిగణించడం జరుగుతున్నదని,నేటి పోటీ ప్ర పంచంలో టేబుల్ టెన్నిస్ పట్ల చాలామంది మక్కువ చూపెడుతున్నారని ముఖ్యంగా ఈ క్రీడా ద్వారా చక్కటి వ్యాయామం తో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

ప్రతినిత్యం విద్యార్థుల క్ర మం తప్పకుండా ఈ సాధనను అలవాటు గా చేసుకొని శారీరకంగా మానసికంగా చా లా దృఢంగా ఉండాలని వారు తెలిపారు. టీం ఈవెంట్స్ విజేతలుగా అండర్ 14 లో మొదటి స్థానం మరియు బంగారు పతకాల విజేతలుగా విపిఎస్ పబ్లిక్ స్కూల్ - విజయవాడ, ద్వితీయ స్థానం మరియు రజత పత కాల విజేతలుగా టైం స్కూల్, రాజేంద్రనగర్ రంగారెడ్డి జిల్లా,అండర్ 17 బాలికల టీం వి భాగంలోమొదటి స్థానం మరియు బంగారు పతకాల విజేతలు శ్రీ ప్రకాష్ ఎనర్జీ స్కూల్- పెద్దాపురం- తూర్పుగోదావరి జిల్లా, ద్వితీయ స్థానం మరియు రజత పతక విజేతలుగా స ర్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ పశ్చిమగోదావరి నిలువగా, అండర్ 19 బాలికల టీం విభాగం లో మొదటి స్థానం మరియు బంగారు పతకాలు శ్రీ ప్రకాష్ ఎనర్జీ స్కూల్ పెద్దాపురం- తూర్పుగోదావరి జిల్లా,ద్వితీయ స్థానం మ రియు రజిత పతకాలు సర్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ - పశ్చిమగోదావరి నిలిచారు.

వ్యక్తిగత పోటీల విజేతలుగా అండర్ 14 బాలికల వి భాగం శీలం మనస్వి - ప్రథమ స్థానం మరి యు బంగారు పతకం సాధించగా, అండర్ 17 బాలికల విభాగం- ఎం శాంతి జ్యోతి మొ దటి స్థానం మరియు బంగారు పతకం సా ధించారు. అండర్-19 ఎం.దర్శిక మొదటి స్థానం మరియు బంగారు పతకం అందుకున్నారు. అదే విధంగా జాతీయస్థాయి పోటీల కు అండర్ 14 మంచి ఎస్. మనస్వి, రిద్ది టోరో, కే నైనా, వంశిక,అండర్ 17 జి.వర్ణిక, ఎస్. తనిష్క, ఎం.దాస్ మరియు మిద్ది శాంతి జ్యో తి,అండర్ 19 బాలికలు విభాగం టి.సాయి సుదీక్ష, కె.రిషికా తులసి, ఎం మాం డవ లినేషియా మరియు ఎం.దర్శిక ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు పద్మారావు, చీఫ్ రెఫరీ శంకర్ , అసోసియేట్ చీఫ్ రెఫరీ రామచంద్ర రావు, ఎంపైర్లు బాబురావు, ఒ తినేల్ గారు, ఎండి గౌస్, రామ్మూర్తి, కే రవి, గంగారాం, వివిధ పాఠశాలల ప్రతినిధులు, కోచ్ లు, మేనేజర్లు, తల్లితండ్రులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

 ఈ టోర్నమెంట్ కు చక్కటి ఆతిథ్యం అందించినటువంటి అల్ఫోర్స్ హైస్కూల్ యజమానానికి వివిధ పాఠశాలల ప్రతినిధులు అభినందనలుతెలియజేసారు.