calender_icon.png 9 August, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాలతో ప్రతిపక్షాలు బెంబేలు.. అక్కసుతోనే విమర్శలు

09-08-2025 12:00:00 AM

చెక్కుల పంపిణీలో నిప్పులు చెరిగిన కవ్వంపల్లి

తిమ్మాపూర్, ఆగస్టు 8 (విజయాక్రాంతి): గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ను అమలు చేస్తున్న తీరును చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని మానకొం డూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.శుక్రవారం ఎల్‌ఎండి కాలనీలోని ప్రజాభవన్‌లో తిమ్మాపూర్ మండలానికి చెందిన 148 మంది లబ్ధిదారులకు 42 లక్షల 17 వేల రూపాయల విలువ గల చెక్కుల తోపాటు మరో 18 మందికి క ళ్యాణ లక్ష్మి చెక్కులనుఆయన పంపిణీ చేశా రు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇప్పించలేని బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభు త్వం ఇవ్వడం చూసి అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలను తమదైన పంథాలో అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా కాకుం డా దరఖాస్తు చేసిన నిర్ణీత గడువులోగా సీ ఎంఆర్‌ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నామని సత్యనారాయణ చెప్పారు.

కార్యక్ర మంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్య క్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, పార్టీ నాయకులు తుమ్మెనపల్లి శ్రీనివాసరావు, గంకిడి లక్ష్మారెడ్డి, చింతల లక్ష్మారెడ్డి,గోగూరి నరసింహారెడ్డి, గొట్టిముక్కల సంపత్ రెడ్డి, బుదారపు శ్రీనివాస్,మాచర్ల అంజయ్య గౌ డ్, పోలు రాము, రమేష్, ముప్పిడి సంపత్ రెడ్డి, కంది అశోక్ రెడ్డి, ఎలక రాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆశిక్ పాషా, గుంట మల్లే శం, మార్క నరసయ్య, బండారుపల్లి లక్ష్మారెడ్డి, వరాల అనిల్, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

---- గన్నేరువరం మండలంలో 70 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణి -----రైతులకు అవసరమైనంత మేరకు యూరి యా బస్తాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 70 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు 18 లక్షల 73 వేల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియాకు కొరత లేదని, అ యినప్పటికీ బీఆర్‌ఎస్ నాయకులు యూరి యా కొరత ఉందంటూ దుష్ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నా యకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, బుర్ర శ్రీధర్ గౌడ్, మాతంగి అనిల్, బొడ్డు సునిల్, బొడ్డు మల్లేశం, కొండాపూర్ శ్రీనివాస్, నర్సింహారెడ్డి,బుర్ర తిరుపతి గౌడ్, సంపత్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.