calender_icon.png 3 September, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

03-09-2025 06:33:03 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్ జీడీ వీరస్వామి అన్నారు. బుధవారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో ఎస్సీ సబ్ ప్లాన్ నుండి మంజూరైన రూ.20 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తుంగతుర్తి శాసనసభ్యుడిగా మందుల సామేలు గెలుపొందిన తర్వాత నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, ప్రభుత్వ కార్యాలయాల వంటి తదితర మౌలిక వసతులు కల్పించారన్నారు.

గ్రామానికి ఇప్పటికే యాదవులకు సంబంధించిన గంగ దేవమ్మ గుడి, ఎస్సీ కాలనీలో ముత్యాలమ్మ గుడి, దుబ్బగూడెం, ముదిరాజ్ వాడా లాంటి తదితర వీధుల్లో సుమారు రూ.కోటి వ్యయంతో మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇందుర్తి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్లు నిర్మించడం జరిగిందని చెప్పారు.ఎమ్మెల్యే సహకారంతో ముందు ముందు కూడా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చనున్నట్లు తెలిపారు.