calender_icon.png 3 September, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్టీ జాబితా నుంచి తొలగించాలానడం సరికాదు

03-09-2025 06:38:37 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొంతమంది ఆదివాసీ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సరికాదని సదాశివనగర్ మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మాలోత్ విజయకుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం పత్రిక ప్రకటన చేశారు.ఆదివాసి నాయకులు స్వలాభం కోసం గిరిజనుల మధ్య తగాదాలు పెట్టొద్దని సూచించారు. బంజారా నాయకుల మీద చేస్తున్న దుష్పర్చారాన్ని మానుకోవాలని కోరారు. బంజారాలు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని సూచించారు.