25-01-2026 12:08:47 AM
గాంధీనగర్ కార్పొరేటర్ ఎ పావనీ వినయ్ కుమార్
ముషీరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): సీసి రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్య త ప్రమాణాలను పాటించి, త్వరితగతిన పూర్తి చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ పావని వినయ్ కుమార్ అధికారు లను ఆదేశించారు. ఈ మేరకు శనివారం గాంధీనగర్ డివిజన్ పరిధిలోని పాత మయూరి థియేటర్ లేన్ లో భాగ్యనగర్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ నుండి మెయిన్ రోడ్డు వరకు సుమారు రూ. 22లక్షల జిహెచ్‌ఎంసి నిధులతో కొనసాగుతున్ సీసి రోడ్డు నిర్మాణ పనులను ఆమె జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహే ష్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ స్థా నిక అపార్ట్మెంట్ వాసులతో కలిసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ ఎలైట్ భాగ్యనగర్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ అసోసియేషన్ వాసులు ఇ. శ్రవణ్ కుమార్, శేషు, అశోక్ బాజ్ప, జ్యోతి రెడ్డి, అంజన తదితరులు పాల్గొన్నారు.