25-05-2025 12:00:00 AM
-సీఐ సీతారాం
కందుకూరు, మే 24 : శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు మూ డో నేత్రంగా పనిచేస్తాయని కందుకూరు సీఐ సీతారాం అన్నారు. శని వారం హైదరాబాద్- శ్రీశైలం రహదారిలో ఉన్న నేదునూరు గేట్ వద్ద మాజీ వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి తన సొంత డబ్బులు రూ.45 వేల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పా టు ఏర్పాటు చేశారు.
దీంతో సిసి కెమరాలను ఎస్‌ఐ సైదులుతో కలిసి ప్రారం భించారు.ఈ సందర్బంగా సీఐ సీతా రాం మాట్లాడుతూ వివిధ పార్టీల నేత లు, వ్యాపారవేత్తలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు సహకారం అందించాలని ఆయన కోరారు. చేయించారని ఆయన కోరారు. నేదునూరు చౌరస్తాలో సీసీ కెమెరాలు ఏర్పాటు కు సహకారం అందించిన మాజీ వైస్ ఎంపీపీ ఎంపీపీ గంగుల సమంత ప్రభాకర్ రెడ్డిని ఆయన అభినందించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కో-ఆర్డినేటర్ యండీ. అఫ్జల్ బేగ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంకగాళ్ల పుష్ప దర్శన్,సొసైటీ డైరెక్టర్ సాదా పాండు రంగా రెడ్డి, గ్రామ అధ్యక్షుడు బొర్రా సురేష్,ఇందిరమ్మ డైరెక్టర్ వరికుప్పల మంజుల బాబు, గంగుల సంజీ వ రెడ్డి, మాజీ వార్డ్ సభ్యులు ఎగిరిశెట్టి నర్సింహా, మైనారిటీ నాయకులు అజారోద్దీన్, ఫైజోద్దీన్, సీనియర్ నాయకు లు వరికుప్పల రవి, బొజ్జ రాఘవేందర్ రెడ్డి, కుమార్ గౌడ్, బిక్షపతి జమేధర్ మల్లేష్, ఎస్‌ఓటి కానిస్టేబుల్ శేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.