calender_icon.png 25 May, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు ముంగిట్లో శాస్త్రవేతలు

25-05-2025 12:00:00 AM

-రైతులకు పలు సూచనలు

ఇబ్రహీంపట్నం, మే 24: రైతు ముంగిట్లో శాస్త్రవేతల కార్యక్రమంలో రైతులకు శాస్త్రవేతలు పలు సూచనలు సూచించారు. శనివారం మండల వ్యవసాయ అధికారి విద్యాదరి ఆధ్వర్యంలో  ఇబ్రహీంపట్నం మండలం పరిధి ము కునూర్ గ్రామంలోని రైతువేదికలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా శాస్త్రవేత్తలు డా.రజినీకాంత్, డా.అరుణ, డా.వెంకట్, వెటర్నరీ డాక్టర్ ఆనంద్ రెడ్డి పాల్గొన్ని రైతులకు విలువైన సూచనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పలు దఫా లలో పంటలు పండించే రైతులు వినియోగం లాభాలను దృష్టిలో ఉంచు కొని అవసరం మేరకే పంటకు నీరు అందించి తక్కువ నీటి వినియోగంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందాలని సూచించారు.

అలాగే రైతు లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సృజన, పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.