24-05-2025 11:09:42 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలో ప్రధానోపాధ్యాయుల శిక్షణ శిబిరంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) ను తులసి మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చదువుకు పేద ధనిక భేదం లేదని, చదువును మించిన ఆయుధం లేదని, చక్కగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక ఉత్తమ ఫలితాలతో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు ఇదే తరహాలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ లచ్చిరాం నాయక్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.