calender_icon.png 8 October, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయి

08-10-2025 06:06:39 PM

ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్..

ఉప్పల్ (విజయక్రాంతి): నేరాలు నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని ప్రతి ఒక్కరు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకొని నేర రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ అన్నారు. బుధవారం రోజు నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సును నాచారం శాంతి గార్డెన్ లో సెక్టార్ ఎస్సై మైబల్లి ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు లావాదేవీల పట్ల జాగ్రత్త వహిస్తూ సైబర్ నేరగాల ఉచ్చులో పడొద్దని ఆయన సూచించారు.

ప్రతి ఒక్కరు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం వలన దొంగతనాలను అరికట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరల పట్ల ఇంట్లో పెద్ద వాళ్లకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఇటీవల కాలంలో చదువుకోని వారి కన్నా చదువుకున్నవారే సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడుతున్నారని  ప్రతి ఒక్కరు సేవా నేరాలు పట్ల జాగ్రత్త ఉండాలని ఆయన సూచించారు. ప్రజలకు భద్రత అవగాహన పెంపొందించి నేరాల నివారణ తమ దేయమని ప్రజల రక్షణే తమకు ముఖ్యమని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.