calender_icon.png 11 October, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖేలో ఇండియా ఖోఖో సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు

11-10-2025 12:27:22 AM

సుల్తానాబాద్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి):కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నడుస్తున్న  ఖేలో ఇండియా కోకో సెంటర్ లో శుక్రవారం సీసీ కెమెరాలు అమర్చారు. కోకో కోర్టుకు నాలుగు వైపుల నాలుగు కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా యోజన క్రీడా శాఖ అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఖేలో ఇండియా సెంటర్లు నడుస్తున్న సందర్భంగా సుల్తానాబాద్ లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ స్పోరట్స్ క్లబ్ అధ్యక్షులు ఎం , రవీందర్, ఖేలో ఇండియా కోకో సెంటర్ కోచ్ , మాజీ భారత కోకో జట్టు క్రీడాకారుడు గెల్లు మధుకర్ యాదవ్ తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.