13-08-2025 05:00:30 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల(Samsthan Narayanapur Mandal) కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను నాయక్, జిల్లా నాయకులు బాలకృష్ణ, ఉప్పల లింగస్వామి, జైపాల్ రెడ్డి, ప్రేమ్ చందర్ రెడ్డి రిబ్బన్ కత్తిరించి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరు సైనికుడిలా పనిచేయాలని అన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.