calender_icon.png 13 August, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలి

13-08-2025 05:37:53 PM

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి ముందస్తు జాగ్రత్త..

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి(CI Venkat Reddy) మాట్లాడుతూ... కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్ మండల, మండల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలో రాబోయే మూడు రోజులు రెడ్ అలెర్ట్ సూచించారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రోడ్ల పైన, బ్రిడ్జిల పైన, వాగుల్లో ప్రవహించే ప్రవాహంలో తొందర ఉందని దాటడానికి ప్రయత్నించవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్ళవద్దని, పాడుబడ్డ లేదా శిథిలావస్తకు చేరువైన ఇండ్లల్లో ఉండరాదని, తడి ఉన్న కరెంట్ వైర్లను, స్థంబాలను తాకవద్దని, అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే సంబంధిత అధికారులకు (లేదా) పోలీస్ వారికీ (లేదా) డయల్ 100 నెంబర్ కి కాల్ చేయ్యాలని సీఐ వెంకట్ రెడ్డి సూచించారు.