13-08-2025 04:51:34 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న ఏకధాటి వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్ వాగు అండర్ బ్రిడ్జిని బుధవారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్(Mancherial District Collector Deepak Kumar) పరిశీలించారు. రాంనగర్ ప్రాంతంలో రాకపోకలు సాగేలా సహాయక చర్యలను వేగం చేయాలని సంబంధిత మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ టి.రమేష్, సిబ్బంది ఉన్నారు.