calender_icon.png 13 August, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల ఆపన్నహస్తం

13-08-2025 05:17:27 PM

పెన్ పహాడ్: మండలంలోని మమ్మాదాపురం ప్రాధమిక పాఠశాల పూర్వ విద్యార్థులు కొందరు తమ చిన్నతనంలో చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం తమవంతుగా ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందించారు. పాఠశాలకు కావలిసిన కనీస సౌకర్యాలైన మైక్ సెట్ ను, అలాగే విద్యార్థులకు స్పోర్ మెటీరియల్ అందించగా మండల విద్యాధికారి నకిరేకంటి రవి(Mandal Education Officer Nakirekanti Ravi) చేతుల మీదుగా అందజేశారు. అలాగే ఆశాజ్యోతి ఫౌండేషన్ బాధ్యులు శ్రీరామ్ వెంకట్ ఆధ్వర్యంలో పిల్లలకు బ్యాగులు, నోట్ బుక్స్ అందించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ ఎం మల్లా రెడ్డి, దాతలు శ్రీరామ్ వెంకట్, అంకటి వెంకన్న, సలిగంటి నరేందర్, సముద్రాల రాంబాబు, రామినేని వెంకటయ్య,సముద్రాల సత్యం, శ్రీరామ్ మధు, గుండు రామరావు, శ్రీరామ్ అంజి, బచ్చు శేణు, గుండు సైదులు తదితరులు ఉన్నారు.