13-08-2025 04:54:48 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల ప్రజలకు తహసీల్దార్ హేమంత్ కుమార్ ముందస్తు హెచ్చరిక ఇచ్చారు. మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వాగులు, శిథిలావస్థ భవనాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్షాల కారణంగా పారుతున్న వాగుల వద్దకు, కాలువలు ప్రజలెవరూ దాటకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే పిల్లలు ఎవరుకూడా ఈతకు చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రతలు పాటించాలని, నిన్న రాత్రి గైరన్ తండాను కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి, సిర్గాపూర్ ఎస్సై మహేష్ లతో కలిసి తహసీల్దార్ సందర్శించారు. వాగు దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ లను ఉంచి వాగు ప్రవాహాన్ని గమనించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని తహసీల్దార్ హేమంత్ కుమార్ తెలిపారు.