13-08-2025 05:30:52 PM
దేవరకొండ: దేవరకొండ పట్టణం వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం దేవరకొండ నియోజకవర్గానికి చెందిన పలు మండలాల లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్(MLA Balu Naik Nenavath) పంపిణీ చేశారు. 166 మంది లబ్ధిదారులకు రూ. 57,46,500/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు వారు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రధానంగా వైద్య చికిత్స, ప్రమాదాల అత్యవసర కుటుంబ అవసరాలు వంటి కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ సహాయం అందించబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.