13-08-2025 04:57:57 PM
- రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందాం
- కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెడుతున్నారో ఆ నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ ముందుకుసాగుదామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) భరోసానిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిసిసి కార్యదర్శి టంకర కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు టంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతయ్య , సాయన్న, వెంకటేష్, రాజశేఖర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.