calender_icon.png 13 August, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కార్మిక కర్షకులు పోరాటాలకు సిద్ధం కావాలి

13-08-2025 05:15:09 PM

మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మలు దగ్ధం..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి)నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద సామ్రాజ్యవాద అనుకూల విధానాలపై కార్మికులు కర్షకులు బ్రిటిష్ దొరలను తరిమికొట్టడానికి ఇచ్చిన పిలుపు క్విట్ ఇండియా స్ఫూర్తితో సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సుభాష్ సెంటర్ లో మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, రైతు సంఘం నాయకులు కుంభం కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ అధికారంలో ఉన్న ఈ 12 సంవత్సరాల కాలంలో కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టే విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు.

పేదరికం నిరుద్యోగం రైతాంగం కార్మికుల సమస్యలు పెరుగుతుంటే పట్టించుకోని మోడీ అంబానీ ఆదాని సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య,టౌన్ కన్వీనర్ అవుట రవీందర్, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, జిల్లా నాయకులు మన్నెం బిక్షం, రైతు సంఘం జిల్లా నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, పోలే సత్యనారాయణ కోట్ల అశోక్ రెడ్డి అద్దంకి నరసింహ రామకృష్ణారెడ్డి, పాక మల్లయ్య, కందుల అశోక్ నాయకులు అంజయ్య తెలకపల్లి శ్రీను బి వెంకటరెడ్డి కె బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.