calender_icon.png 13 August, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మాదక ద్రవ్యాల రహిత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

13-08-2025 05:06:40 PM

మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన..

నల్గొండ క్రైం: మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్(District SP Sarath Chandra Pawar) అన్నారు. బుధవారం ఎన్ జి కాలేజీలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్ధి దశలో మాదక ద్రవ్యాల మాయలో పడి జీవితం వృథా చేసుకోకూడదని, ఒక్కసారి డ్రగ్స్ వాడితే అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. డ్రగ్స్ వాడకం వలన యువత యొక్క శారీరక, మానసిక ఆరోగ్య విచ్ఛిన్నం కావడంతో పాటు, ఆర్థిక సమస్యలు, సమాజంలో గౌరవం లేకుండా పోతుందని అన్నారు. సంతోషం కొరకు సేవించడం అలవాటుగా మారి డ్రగ్స్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు.

మత్తుపదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని, డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు, తమ దృష్టికి నిషేధిత డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలని సూచించారు. యువత ఒక్కసారి డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదు అయితే భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు,  ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉండదన్నారు వారి జీవితం అంధకారంలోకి వెళ్తుందని తెలియజేశారు. ఎవరైనా గంజాయి డ్రగ్స్ సేవిస్తే ఎన్డిపిఎస్ చట్టం-1985తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను క్రయవిక్రయాలు, సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నెంబర్ 8712670266 కు సమాచారం తెలపాలని కోరారు. అనంతరం మాదక ద్రవ్యాల పై  జరుగుతున్న పోరాటంలో క్రియశిలా భాగస్వామి అవుతానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు,  అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తాను అని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సిఐ రాఘవరావు, 2 టౌన్ ఎస్సై సైదులు, కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్, అధ్యాపకులు, విద్యార్దిని,విద్యార్థులు పాల్గొన్నారు.