13-08-2025 05:41:32 PM
హనుమకొండ (విజయక్రాంతి): ప్రతి ఇంట్లో జాతీయ పతకం అనే నినాదంతో ర్యాలీ, అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు తెలిపారు. జాతీయ పతాకం ప్రతి ఇంటిపై ఎగరవేయాలని స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన కల్పించడం, పతాకం ప్రాధాన్యత ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం కోసమే ఈ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు, కళాశాల అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం స్వతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రపంచం అబ్బురపడే విధంగా మన స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం కోసమే విస్తృత ప్రచారం దేశభక్తి, సమైక్యభావం ఉట్టిపడే విధంగా ఈ ర్యాలీ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుండి ములుగు రోడ్డు జంక్షన్ వరకు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ ఎస్ఎస్సి రామదురై ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కే రాజేందర్రెడ్డి, కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, డిగ్రీ కోఆర్డినేటర్ వి మధుకర్ రావు, సిహెచ్ రవీందర్, ఎస్వి రమణారెడ్డి,కే నగేష్, ఎస్ సతీష్ కుమార్, క్యాడేట్స్ బి మోహన్ సీనియర్ అండ్ ఆఫీసర్, శివప్రసాద్ జూనియర్ అండ్ ఆఫీసర్, భాగ్యలక్ష్మి జూనియర్ అండ్ ఆఫీసర్, హర్షిత్ నందన్, వెన్నెల, రవళి, మనుష, రిషిత, ఆసియా, సాహిత్య, సిరివెన్నెల పాల్గొన్నారు.