calender_icon.png 20 August, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

20-08-2025 07:42:56 PM

బెల్లంపల్లి రూరల్ సిఐ హనూక్..

బెల్లంపల్లి (విజయక్రాంతి): పండుగలను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జరుపుకోవాలని బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్ కోరారు. బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏ పండుగలు వచ్చిన ప్రజలందరూ కులమత బేధం లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన కోరారు, వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ నేపథ్యంలో ముందస్తుగా ముస్లిం సోదరులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఈ శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వినాయక చవితి ఉత్సవాలు ముగిసేంతవరకు ప్రతి ఒక్కరు పోలీసు వారి సూచనలు పాటిస్తూ ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా జరుపుకోవాలని సూచించారు.

వినాయక చవితి విగ్రహాలు పెట్టేవారు దారికి అడ్డంగా పెట్టకూడదని అలాగే సౌండ్ సిస్టం పోలీసు వారి అనుమతి తీసుకొని నిర్దేశించిన సమయంలో భక్తి పాటలు పెట్టుకోవాలని కోరారు. మసీదులు ప్రార్థన సమయంలో ఒకరికొకరు పోటీ పడకుండా సహకరించుకుంటూ ఆ సమయంలో సౌండ్ సిస్టం తగ్గించుకునే ప్రయత్నం చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి మండపం వద్ద సంబంధిత వాలంటీర్లు ఎప్పటికీ అందుబాటులో ఉండాలని ఎలాంటి సాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దన్నారు.  ప్రతి రోజు మా సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై కిరణ్ కుమార్ తో పాటు ముస్లిం మత పెద్దలు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.