పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
షైన్ పాఠశాల కరెస్పాండెంట్ భానుంచందర్
పాఠశాలలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని షైన్ పాఠశాల కరెస్పాండెంట్ భానుచందర్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని షైన్ పాఠశాలలో గురువారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ భానుచందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్క నాటి దానిని సంరక్షిస్తే నేడు నాటిన మొక్క రేపటి తరాలకు అమూల్యమైన సంపదగా నిలుస్తుందని తెలిపారు.
వన మహోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి,వారి సేవలను, తెలంగాణా ఉద్యమంలో ఆయన పాత్రను విద్యార్థులకు వివరించి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి, ఇంచార్జి రాజేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






