29-09-2025 06:18:44 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లోని బాపునగర్ లో కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా చైర్మన్ అరిగెల నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రముఖులకు కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. పూజారి రాజు శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, ముక్త విలాస్, సిద్ధంశెట్టి అశ్విన్, సుగుణాకర్, శ్రీనివాస్ గౌడ్, ఆనంద్, శ్రీనివాస్, తో పాటు కాంగ్రెస్ నాయకులు చరణ్, బలరాం నాయక్, అడ్వకేట్ దీపక్ పాల్గొన్నారు.