calender_icon.png 29 September, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో సద్దుమణిగిన రావణాసుర వద వివాదం

29-09-2025 06:23:46 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): గత కొంతకాలంగా బెల్లంపల్లిలో రావణాసుర వదపై జరుగుతున్న వివాదం ఎమ్మెల్యే గడ్డం వినోద్ జోక్యంతో సోమవారం సద్దుమణిగింది. ఎమ్మెల్యే వినోద్ దళిత సంఘాల నాయకులను, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులను పిలిపించి మాట్లాడారు. బెల్లంపల్లిలో శాంతి భద్రతల సమస్యలు ఎత్తకుండా ప్రజల అభిప్రాయం మేరకు రావణాసుర వదలను అడ్డుకోవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సోదర భావంతో రావణాసుర వద కార్యక్రమాన్ని జరుపుకునేలా ఇరువర్గాల నాయకులు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మునిమంద రమేష్, చిప్ప మనోహర్, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు నగేష్, బాల సంతోష్, దళిత సంఘాల నాయకులు కుంభాల రాజేష్, చిలుక రాజనర్సు, గో గర్ల శేఖర్, గోమాస రాజంలు ఉన్నారు.